Samantha Dance: సిటాడెల్ సక్సెస్ పార్టీలో డ్యాన్స్‌తో అదరగొట్టిన సమంత.. వీడియో వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత స్పై ఏజెంట్గా నటించిన థ్రిల్లర్ మూవీ 'సిటాడెల్: హనీ బన్నీ' (Citadel Honey Bunny). ఈ వెబ్ సిరీస్ అందించిన విజయంతో సామ్ హ్యాపీగా ఉంది. 

ఈ నేపథ్యంలో సిటాడెల్: హనీ బన్నీమేకర్స్ గ్రాండ్ సక్సెస్ మీట్ను జరుపుకున్నారు. నవంబర్ 27న సాయంత్రం ముంబైలో స్టార్-స్టడెడ్ గాలాను నిర్వహించింది. ఈ ఫంక్షన్లో సమంతతో పాటు హీరో వరుణ్ ధావన్, నిమ్రత్ కౌర్, మృణాల్ ఠాకూర్, సాకిబ్ సలీమ్ మరియు వామికా గబ్బితో సహా పలువురు సినీ ప్రముఖులు హాజరై ఎంజాయ్ చేశారు.

ఇటీవలే ‘బేబీ జాన్‌’ నుంచి రిలీజై ట్రెండ్‌ సృష్టిస్తోన్న ‘నైన్‌ మటక్కా’ సాంగ్కు సమంత, వరుణ్ ధావన్‌లు డ్యాన్స్ వేశారు. ఆ పాట హుక్‌ స్టెప్స్‌కి సామ్, వరుణ్ డ్యాన్స్ వేసి అలరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read :- సస్పెన్స్ థ్రిల్లర్‌గా అజిత్ మూవీ టీజర్

ఈ క్రమంలో సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెరవెనుక ఫొటోస్ను షేర్ చేసుకుంది. సిటాడెల్ బృందంతో గడిపిన అద్భుతమైన క్షణాలను ఆస్వాదిస్తూ థ్యాంక్స్ చెప్పింది. "అందమైన వ్యక్తులతో గడిపిన ఒక అందమైన సాయంత్రం, నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది" అంటూ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.

ఇక వెబ్ సీరీస్ విషయానికి వస్తే.. (నవంబర్ 7న) అమెజాన్ ప్రైమ్ వీడియోలో సిటాడెల్ స్ట్రీమింగ్కి వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కీలక పాత్రలో నటించిన ఈ స్పై థ్రిల్లర్ వెబ్ సీరీస్ను రాజ్ & డికె (రాజ్ నిడిమోరు మరియు కృష్ణ డికె) తెరకెక్కించారు.

ఇందులో సమంత మరియు వరుణ్ ధావన్ స్పై ఏజెంట్స్ హనీ బన్నీ పాత్రల్లో నటించారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ తర్వాత సమంత చేసిన వెబ్ సిరీస్ కావడంతో భారీ అంచనాలతో రిలీజై సక్సెస్ అందుకుంది. మొత్తం ఆరు ఎపిసోడ్లుగా రిలీజైన ‘సిటాడెల్’ ప్రపంచదేశాల్లో దూసుకెళ్తోంది.