డిసెంబర్ 8 వరకు సిన్​​​ బాక్స్​ విన్యాసాలు

ఇండియన్​ ఆర్మీ, కంబోడియన్​ ఆర్మీ మధ్య జాయింట్​ టేబుల్​ టాప్ ఎక్సర్​సైజ్​, సిన్​ బాక్స్​ ఒకటో ఎడిషన్​ పుణెలోని ఫారిన్​ ట్రైనింగ్​ నోడ్​లో 2024, డిసెంబర్ 1 నుంచి 8 వరకు నిర్వహిస్తున్నారు. ఈ విన్యాసాల్లో కంబోడియన్​ ఆర్మీ, ఇండియన్​ ఆర్మీ నుంచి 20 మంది చొప్పున సైనికులు పాల్గొంటున్నారు. ఈ విన్యాసాలు ఐక్యరాజ్యసమితి చార్టర్​లోని చాప్టర్ 6 అనుగుణంగానే తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి యుద్ధ విన్యాసాల నిర్వహణకు ఉద్దేశించింది. కౌంటర్​ టెర్రరిజం ఉన్న ప్రదేశాల్లో శాంతిని నెలకొల్పేందుకు ఇంటెలిజెన్స్​, నిఘా కోసం జాయింట్​ ట్రైనింగ్​ టాస్క్​ఫోర్స్​ ఏర్పాటుకు సంబంధించిన చర్చలపై ఈ విన్యాసాల్లో దృష్టిసారించారు. 

  • ఇరుదేశాల మధ్య విశ్వసనీయత, స్నేహాన్ని పెంపొందించడం, ఇరు దేశాల దళాల మధ్య రక్షణ సంబంధాలను బలోపేతం చేయడం.  
  • శాంతి పరిరక్షణ కార్యకలాపాలను చేపట్టేటప్పుడు ఇరు సైన్యాల ఉమ్మడి కార్యాచరణ సామర్థ్యాన్ని పెంపొందించడం. 
  • ఈ విన్యాసాలు మూడు దశల్లో జరుగుతాయి. 
  • దశ–1 ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ కమిషన్​లో భాగంగా తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కోసం సన్నాహాలు జరుగుతాయి. 
  • దశ–2 ఇరుదేశాలకు చెందిన ఆర్మీ అధికారులు సమావేశంలో రక్షణపరమైన, భద్రతపరమైన అంశాల గురించి చర్చిస్తారు.   
  • దశ–3 విన్యాసాల తుది దశలో భాగంగా ఇరుదేశాలు కౌంటర్​ టెర్రరిజాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధత కావడానికి విన్యాసాలు జరుగుతాయి.

అగ్ని వారియర్​ 2024 

భారతదేశం, సింగపూర్​ల మధ్య అగ్ని వారియర్​ 2024 పేరిట ద్వైపాక్షిక సైనిక విన్యాసాలు మహారాష్ట్రలోని దేవ్​లాలీ ఫీల్డ్​ ఫైరింగ్​ రేంజ్​లో నవంబర్​ 28 నుంచి నవంబర్​ 30 వరకు జరిగాయి. ఇరు దేశాల సాయుధ దళాల మధ్య రక్షణ సహకారం పెంపొందించడం.