నారా లోకేష్ కు నోటీసులిచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఐడీ అధికారులు

ఢిల్లీ: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ నేత నారా లోకేష్ చుట్టు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో  లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీకి చేరుకున్న సీఐడీ అధికారులు. కోర్టు ఆదేశాల మేరకు 41ఏ కింద నారా లోకేష్ కు నోటీసులు ఇవ్వనున్న సీఐడీ అధికారులు.  చంద్రబాబు అరెస్ట్ తర్వాత గత కొద్ది రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు నారా లోకేష్.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ (ఐఆర్‌ఆర్) అలైన్‌మెంట్ కేసులో 14వ నిందితుడిగా గుర్తించి నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. 2022 ఏప్రిల్‌లో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి CIDకి చేసిన ఫిర్యాదు ఆధారంగా నారా లోకేష్‌పై చర్యలు ప్రారంభించారు. మూడు రోజుల క్రితం నారా లోకేష్ ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. లోకేష్ ఢిల్లీలో ఉన్నందున టీడీపీ నేత తరపున ఆయన తరఫు న్యాయవాది ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.  అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు టీడీపీ నేత నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయడంతో పాటు  ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌లో అతనికి 41A నోటీసును అందజేయాలని పోలీసులను ఆదేశించింది.

Also Read : Gold and silver Rate : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు .. మార్కెట్ లో కొత్త రేట్లు ఇవే

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు

2014 నుంచి 2019 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని మాస్టర్‌ప్లాన్ రూపకల్పన, రింగ్‌రోడ్‌ అలైన్‌మెంట్‌కు సంబంధించి కొందరు వ్యక్తులకు తప్పుడు లాభం చేకూర్చేలా అప్పటి ప్రభుత్వ పెద్దలు కొన్ని చట్టవ్యతిరేక, అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధిలో భూసేకరణ, ఇతర అంశాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని అధికార పార్టీ ఆరోపించింది.