అమరావతి భూ కుంభకోణం పై ఈడీ కేసు నమోదు చేసింది. గతంలో అమరావతి భూముల కొనుగోలు అక్రమాలపై సీఐడీ విచారణ చేపట్టింది. విచారణ లో భాగంగా కేబినెట్ సబ్ కమిటీ నాలుగువేల ఎకరాల్లో కుంభకోణం జరిగినట్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా విచారణ ముమ్మరం చేసిన సీఐడీ అధికారులు ..తెల్ల రేషన్ కార్డు హోల్డర్లు అమరావతి కోర్ ఏరియాలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు తేల్చారు.
790 మంది తెల్ల రేషన్ కార్డు హోల్డర్లు భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించిన అధికారులు.. తెల్ల రేషన్ కార్డు హోల్డర్లు పేరుతో రాజకీయ నాయకుల భూములు కొనుగోలు చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భూముల కొనుగోలులో మనీలాండరింగ్ జరిగిందంటూ అనుమానం వ్యక్తం చేసిన అధికారులు విచారణను వేగవంతం చేశారు.
విచారణ నేపథ్యంలో భూకుంభకోణంపై కేసు నమోదు చేయాలంటూ సీఐడీ..ఈడీకి లేఖ రాసింది. తాజాగా అమరావతి భూములపై ఈడీ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది.
