ఇసుక ట్రాక్టర్ పట్టివేత

ఆమనగల్లు, వెలుగు: మాడ్గుల్  మండలం అందుగుల వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను మంగళవారం పట్టుకున్నట్లు సీఐ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. పెట్రోలింగ్  నిర్వహిస్తుండగా, ఎలాంటి అనుమతులు లేకపోవడంతో ట్రాక్టర్ ను సీజ్  చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు చెప్పారు. ట్రాక్టర్  డ్రైవర్  చెన్నయ్యపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.
 

కేటిదొడ్డి: కర్నాటక నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు కేటిదొడ్డి ఎస్ఐ శ్రీనివాస్​రావు తెలిపారు. ట్రాక్టర్లను సీజ్ చేసి ఆంజనేయులు, నరసింహులుతో పాటు డ్రైవర్ల పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కేసులు పెడతామని తెలిపారు.