కలర్​ఫుల్ ​క్రిస్మస్ ​లైటింగ్

క్రిస్మస్ ​సెలబ్రేషన్స్​కు గ్రేటర్ ​ముస్తాబైంది. సిటీలోని చర్చిలను క్రిస్టియన్లు అందంగా ముస్తాబు చేశారు. భారీ క్రిస్మస్ ​ట్రీలు, కలర్​ఫుల్ ​లైటింగ్​తో డెకరేట్​ చేశారు. పండుగ సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మాల్స్, మార్కెట్లలో మంగళవారం సాయంత్రం క్రిస్మస్​షాపింగ్​ సందడి నెలకొంది. గ్రేటర్​ ప్రజలకు అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, కమిషనర్​ ఇలంబరితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.