Christmas 2024 : క్రిస్మస్ కేక్స్.. బిర్యానీ స్పెషల్స్.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టయిల్ రెసిపీలు ఇవే.. ట్రై చేయండి.. ఎంజాయ్ చేయండి..!

క్రిస్మస్ వేడుకల్లో ఫుడ్ కూడా ప్రధానమే. స్వీబ్, హాట్, లంచ్, స్నాక్స్ విత్ కాపీ.. పండుగ రోజు కామన్, కొత్తకొత్త డిస్ప్లేలను బయటి నుంచి తెప్పేందుకుంటే సరిపోతుందని చాలామంది అనుకుంటారు.. అలాంటి కొత్త వంటకాలు.. ఇంట్లోనే ఈజీగా చేసుకునేవి ఇవి: 

ఫడ్జ్ బ్రౌనీ 

కావాల్సినవి:

  • వెన్న: కప్పు 
  • గుడ్లు: 4 
  • వెనిలా ఎసెన్స్: అరటీస్పూన్ 
  • మైదా: కప్పు 
  • చాక్లెట్ ముక్కలు: రెండు కప్పులు 
  • వాల్ నట్స్: 2 టీస్పూన్లు
  • బేకింగ్ పౌడర్: 1 టీస్పూన్
  • ఉప్పు: చిటికెడు 

తయారీ:
 

  • ఒక గిన్నెలో వెన్న, చాక్లెట్ ముక్కల్ని తీసుకుని, చిన్న మంటపై కరిగించాలి. అది చల్లారే లోపల మైదా ఉప్పు, బేకింగ్ పౌడర్, వాల్ నట్స్ కలిపి పెట్టాలి.
  • ఇప్పుడు చాక్లెట్ మిశ్రమంలో ఒక్కో గుడ్డు చల్లాదిన తర్వాత మైదాతో పాటూ వెనీలా ఎసెన్స్ వేసి అన్నింటిని మరోసారి కలపాలి. ఇప్పుడు చాక్లెట్ మిశ్రమంలో ఒక్కో గుడ్డు  సొన వేసుకుంటూ కలపాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మైదాతో పాటు వెనీలా ఎసెన్స్ వేసి అన్నిటిని మరోసారి కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బిస్కెట్లలా చేయాలి. వాటిని ఒవెన్లో 180 డిగ్రీల ఉష్ణోగ్రతలో 10 నుంచి 15 నిమిషాల సేపు బేక్ చేయాలి. చివరగా చార్లెట్ సిరప్ తో గార్నిష్ చేసి ఫడ్జ్ బ్రౌనీలను సర్వ్ చేయచ్చు.

కొబ్బరి రైస్ కేక్:

  • కావాల్సినవి బియ్యం: 2 కప్పులు 
  • నీళ్లు: రెండున్నర కప్పులు 
  • కొబ్బరిపాలు: పావు లీటరు 
  • చక్కెర: ఒకటిన్నర కప్పు 
  • కొబ్బరి తురుము: కప్పు 

తయారీ:

  • ముందు బియ్యం కడిగి నాలుగు గంటలు నానబెట్టాలి.తర్వాత రెండున్నర కప్పుల నీళ్లతో ఉడికించాలి. ఉడికించిన అన్నం మీద మూతపెట్టి ఉంచాలి.
  • ఒక పాన్ లో కొబ్బరిపాలు, కప్పు చక్కెర వేసి కలుపుతూ ఐదు నిమిషాలు ఉడికించాలి.పంచదార కరిగిన తర్వాత దించి ఉడికించిన అన్నంలో వేసి బాగా కలపాలి.
  • అందులోనే అరకప్పు కొబ్బరి తురుము వేసి కలపాలి.ఇప్పుడు కేక్ పాన్ కు వెన్న లేదా నెయ్యి రాసి దానిపై ఒక టేబుల్ స్పూను.
  • కొబ్బరి పొడి, టేబుల్ స్పూను చక్కెర చల్లాలి.
  • వాటిపై కేకు మిశ్రమం చేసి 180 డిగ్రీల ఉష్ణోగ్రతతో 45 నిమిషాల బేక్ చేసి తీయాలి. విడిగా ఒక పాన్ లో మిగిలిన కొబ్బరి, చెక్కెర వేసి సన్నని మంటపై వేగించాలి.కొబ్బరి మంచి వాసన వచ్చే వరకు వేగిన తర్వాత.. వేడి లేకు మీద చల్లాలి.


బనానా పాన్ కేక్:

  • అరటిపండు: 2 
  • గోరుమపిండి: కప్పు 
  • చక్కెరపొడి: కప్పు 
  • బేకింగ్ పౌడర్: 3 టీ స్పూన్లు 
  • పాలు: పావు లీటరు 
  • వెన్న: 2 టీ స్పూన్లు 
  • వెనిలా ఎసెన్స్ 2 టీ స్పూన్లు 
  • గార్నిష్ కోసం 
  • కిస్మిస్ : టీ స్పూన్ 
  • తేనె 1 టీస్పూన్ 
  • వాల్ నట్స్: 2 టీ స్పూన్లు 


తయారీ:

  • ఒక గిన్నెలో తొక్క తీసేసిన అరటి పండ్లను మెత్తగా చిరమాలి. తర్వాత చక్కెర పొడి, గుడ్డు సొనను వేసి బాగా కలపాలి.
  • ఈ మిశ్రమంలో వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. తర్వాత గోరుము పిండి, పాలు వేసి ఉండలు లేకుండా కలిపి, దోశ పిండిలా చేసుకోవాలి.
  • పాన్ పై వెన్న వేడి చేసి తయారు చేసుకున్న దోశ మిశ్రమాన్ని మందంగా వేయాలి. ఈ పాన్ కేసి ను రెండు వైపులా బాగా కాల్చాలి. 
  • చెర్రీస్, కిస్మిస్, వాల్నట్స్, తేనెంతో గార్నిష్ చేసుకుంటే బనానా పాన్ కేక్ రెడీ.


హాట్ చాక్లెట్:

కావాల్సినవి:

  • పాలు: 1కప్పు 
  • కొకోవా పౌదర్ (చక్కెర లేనిది): 1.5 టేబుల్ స్పూన్ 
  • చక్కెర: రెండు టేబుల్ స్పూన్లు 
  • వెనీలా ఎసెన్స్: 2 చుక్కలు 

తయారీ:

  • ముందుగా రెండు స్పూన్ల పాలల్లో కొకోవా పౌడర్ వేయాలి.
  • చక్కెర కూడా వేసి అది పూర్తిగా కరిగే వరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక చిన్న పాన్లో తీసుకొని మిగిలిన పాలు వేసి కలపాలి.
  • తర్వాత స్థాపై పెట్టి మరిగిస్తూ వెనీలా ఎసెన్స్ వేయాలి.
  • నురగలు వచ్చేలా ఈ మిశ్రమాన్ని కలిపి గ్లాసులో పోసుకుంటే హాల్ చాక్లెట్ రెడీ

మటన్ కాశ్మీరీ బిర్యానీ 

కావాల్సినవి:

  • మటన్ ముప్పావు కిలో 
  • బాస్మతి రైస్: కిలో 
  • పాలు: 1 కప్పు 
  • పెరుగు: 2 టీ స్పూన్లు 
  • శొంఠి  పొడి: టీస్పూను 
  • యాలకుల పొడి: పావు టీ స్పూను 
  • బిర్యానీ ఆకు: 1 
  • కుంకుమ పువ్వు: చీటికెడు 
  • కారం: 2 టీ స్పూను 
  • ఇంగువ: చిటికెడు 
  • గరంమసాలా: 2 టీ స్పూన్లు 
  • సోంపు పొడి 1 టీ స్పూన్లు 
  • చక్కెర: పావు టీ స్పూను 
  • ఉప్పు సరిపడా 

తయారీ:

  • పాన్లో నెయ్యి వేడి చేసి ఇంగువ మటన్ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేగించాలి. అందులోనే పెరుగు కూడా కలిపి రంగుమారే వరకూ వేగించాలి.
  • ఇప్పుడు ఉప్పు, కారం, శొంఠి పొడి, బిర్యానీ ఆకు, చక్కెర వేసి కాసేపు అయ్యాక అరలీటరు నీళ్లు పోయాలి.
  • అందులో అర టీ స్పూను గరం మసాలా, టీ స్పూను సోంపు పొడి వేసి చిన్న మంటపై ఉడికించి ఉంచాలి. ఇప్పుడు మటన్ ముక్కల్ని తీసి విడిగా ఒక గిన్నెలో పెట్టాలి. అదే పాన్లో మరో రెండు లీటర్ల నీళ్లు పోసి ఉప్పు వేయాలి.
  • ఇప్పుడు గరం మసాలా మిగిలిన సోంపు పొడిని పలరటి క్లాత్లో మూట కట్టి నీళ్లలో వేయాలి.తర్వాత బియ్యం వేసి చిన్నమంటపై వగం ఉడికే వరకు ఉంచి స్టవ్ ఆపేయాలి.
  • తర్వాత అందులో నుంచి నీళ్లు వంపేసి మటన్ ముక్కలు, అన్నం పొరలు పొరలుగా అడుగు మందంగా ఉన్న గిన్నెలో వేసి మూతపెట్టి సిమ్ లో దమ్ చేస్తే మటన్ కాశ్మీరీ బిర్యానీ రెడీ.