Christmas 2024: క్రిస్మస్ కప్ కేక్స్.. ఇంట్లో ఇలా తయారు చేసుకోండి.. టేస్టీగా.. రుచిగా.. వావ్ అంటారు..!

పుట్టినరోజు.. ప్రమోషన్.. ఫంక్షన్.. సెలబ్రేషన్ ఏదైనా కేక్ కట్ చేస్తుంటారు. ఇలా చూడగానే... అలా నోరూరించే కేక్స్ లో చాలా రకాలు ఉన్నాయి. అందులోనూ 'కప్ కేక్' పేరు వినగానే నోరూరుతుంది. చిన్న చిన్న గిన్నెల్లో.. నచ్చిన రంగు, మెచ్చిన రూపంలో కప్ కేక్స్ రెడీ చేసుకోవచ్చు. అందులో కొన్ని..

కేక్ బాల్స్ 

కావాల్సినవి : కేక్ పోడి : ఆర కిలో
 మిక్స్డ్ డ్ ఫ్రూట్ జామ్ : 200 గ్రాములు, 
కోకోవాపొడి : 50 గ్రాములు 
కొబ్బరి పొడి : పావు కిలో
జీడిపప్పు, బాదం. కిస్ మిస్: అరకప్పు

తయారీ

ఒక గిన్నెలో ఫ్రూట్ జామ్ తీసుకుని బాగా గిల క్కొట్టి క్రీమ్ లా చేయాలి. తర్వాత మరో గిన్నెలో కేక్ పొడి తీసుకుని కోకోవా పొడి, కొబ్బరి పొడి వేసి బాగా కలపాలి. అందులో క్రీమ్ లా చేసుకున్న జామ్ కూడా వేసి ముద్దలా కలపాలి. అవసరమైతే ముద్దగా అవ్వడానికి కొంచెం పాలు కూడా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని అరగంట సేపు నానబెట్టాలి. తర్వాత డ్రైఫూట్స్ వేసుకుని బాల్స్ చేసుకుని. చివరగా కొబ్బరిపొడిలో దొర్లిస్తే యమ్మీ కేక్ బాల్స్ రెడీ

క్యారెట్ యాపిల్ కప్ కేక్
కావాల్సినవి : 

గుడ్డు : 1(పెద్దది) 
లైట్ బ్రౌన్ షుగర్ : అరకప్పు, 
నూనె : పావు కప్పు
చక్కెర : పావు కప్పు
క్రీం : పావు కప్పు
వెనీలా ఎసెన్స్-2 టీ స్పూన్లు
దాల్చిన చెక్క పొడి: 2 టీ స్పూన్లు
జాజికాయ పొడి అరటీస్పూన్
మైదా: 1 కప్పు
బేకింగ్ పౌడర్ : అర టీ స్పూన్
 బేకింగ్ సోడా : అర టీ స్పూన్
ఉప్పు కొంచెం
క్యారెట్, యాపిల్ తురుము: 3/4 కప్పు చొప్పున

తయారీ : ఓవేన్ ని ముందుగా 350 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో గుడ్డు సాన, బ్రౌన్ షుగర్ నూనె, చక్కెర, క్రీం, వెనిలా ఎసెన్స్ దాచ్చిన చెక్క పొడి, జాజికాయ పొడి వేసి బాగా కలపాలి. అందులో మైదా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఉప్పు వేసి కలపాలి. కానీ గిలక్కొట్టకూడదు. ఇప్పుడు క్యారెట్, యాపిల్ తురుము వేయాలి. కప్పుల్లో కొద్దిగా మైదా చల్లి తయారు చేసుకున్న మిశ్రమాన్ని సగం కప్పు వరకు తీసుకుని 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు బేక్ చేయాలి

రెడ్ వెల్వెట్ కప్ కేక్
 
కావాల్సినవి : 
గుడ్డు : 1(పెద్దది) 
చక్కెర : అరకపు
మజ్జిగ: పావు కప్పు
వెన్న : 2 టేబుల్ స్పూను
వెనిగర్: 1/2 టీస్పూన్
వంటసోడా: చిటికెడు
మైదా: అరకప్పు
మొక్కజొన్న పిండి: పావు కప్పు
రెడ్ ఫుడ్ కలర్: చిటికెడు
చాక్లెట్ పొడి పావు కప్పు
వెనిలా ఎసెన్స్, అరటీస్పూన్

తయారీ

గుడ్డు సొన, చక్కెర. వంట సోడా, మైదా, మొక్కజొన్న పిండి. చాక్లెట్ పోడి. ఫుడ్ కలర్ ఒక గిన్నెలోకి తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. తర్వాత కరిగించిన వెన్న, వెనిలా ఎసెన్స్, మజ్జిగ, వెనిగర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని కప్పుల్లో సగం వరకు తీసుకుని ఒవెన్ లో 180 డిగ్రీల ఉష్ణోగ్రతలో పది నుంచి ఇరవై నిమిషాలు బేక్ చేసుకుంటే రెడ్ వెల్వెట్ కప్ కేక్ సిద్దం

ఫ్రూట్ కప్ కేక్

కావాల్సినవి : 
వెన్న 100 గ్రాములు
చక్కెర పొడి 100 గ్రాములు, గుడ్లు: 2.
క్యాండిడ్ జింజర్, 1 టేబుల్ స్పూన్
మైదా: 100 గ్రాములు 
బేకింగ్ పౌడర్: 1 టీస్పూన్ (మార్కెట్లో దొరుకుతుంది)
పండ్ల ముక్కలు అర కప్పు
క్రీమ్ 125 ఎమ్ఎల్, చక్కెర సిరప్: 2 టేబుల్ స్పూన్లు

తయారీ: ఒక గిన్నెలో వెన్న, చక్కెర పొడి, గుడ్డు సోన వేసి గిలక్కొట్టి చాగా కలపాలి. తర్వాత మైదా, బేకింగ్ పౌడర్ కూడా కలిపి కప్పులో  సగం వరకు వేసి ఒవెన్ లో 180 డిగ్రీల ఉష్ణోగ్రతలో 10 నుంచి 15 నిమిషాలు బేక్ చేయాలి. బేక్ అయిన కేక్ మధ్యలో చిన్న రంధ్రాలు చేసి పండ్ల ముక్కలు, షుగర్ సిరప్, క్యాండిడ్ జింజర్ క్రీమ్ వేసుకుంటే ఫ్రూట్ కప్ కేక్ రెడీ.

ALSO READ : కిచెన్ తెలంగాణ : క్రిస్మస్​ కేక్స్ & కుకీస్!..ఈ స్పెషల్ ఐటెమ్స్ ఒకసారి ట్రై చేయండి