Viral Video: ఇదెక్కడి కాంబినేషన్ రా బాబూ.. చాక్లెట్ తో పరోటా.. తిడుతున్న జనాలు

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని వీడియోలు చూస్తే జన్మలో అసలు వాటిని తినరు.. జనాల పైత్యానికి హద్దులేకుండా పోతుంది.. వారికున్న పిచ్చితో జనాలకు పిచ్చెక్కించేలా వింత వంటలను ట్రై చేస్తుంటారు.. కొన్ని కాంబినేషన్స్ చూస్తే ఇక అసలు ఆ ఫుడ్ ను తినాలనిపించదు.. ఇప్పుడు అలాంటిదే ఓ ఫుడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అదే చాక్లేట్ పరోటా.. దీని గురించి వింటూనే డోకు వస్తుంది కదా ఇక తింటే పరిస్థితి ఏంటో అర్ధం అవ్వడంలేదు కదా.. ఒక్కసారి ఎలా తయారు చేస్తున్నారో ఒకసారి చూద్దాం…

ఆహా.. ఏమిరుచి.. అనరా మైమరిచి.. అని పాడుకుంటూ ఇష్టమైన ఫుడ్ ను తింటుంటే ఆ మజానే వేరు. మన దేశంలో స్ట్రీట్ ఫుడ్ నుంచి స్టార్ ఫుడ్ వరకు ఎన్నో వరైటీలు ఉన్నాయి. వెజ్, నాన్ వెజ్ డిషెస్ లో లెక్కలేనన్ని రకాలు ఉన్నాయి. సాంప్రదాయ మిఠాయిల నుంచి సాయంత్రం తినే స్నాక్స్ వరకు మరెన్నో ఉన్నాయి. కాబట్టే భారతీయులు భోజనప్రియులు అనే ట్యాగ్ ను తెచ్చుకున్నారు. ఒక్కో వంటకాన్ని ఒక్కో స్టైల్ లో వండాలి. అలా చేస్తేనే అవి మంచి రుచిని అందించడంతో పాటు ఆరోగ్యాన్నీ ఇస్తాయి. కాస్త డిఫరెంట్ గా చేయాలని ప్రయత్నిస్తే కొన్ని సార్లు చక్కగా కుదరవచ్చు కుదరకపోవచ్చు. ప్రస్తుతం అలాంటి కుకింగ్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చాక్లెట్ అంటే పిల్లలకే కాదు పెద్దవాళ్లకూ చాలా ఇష్టం. ఆనందంగా ఉన్నా, బాధగా ఉన్నా తియ్యని వేడుక చేసుకునేందుకు చాక్లెట్ ను లాగించేస్తుంటారు. అయితే అలాంటి చాక్లెట్ తో ఓ వ్యక్తి పరాఠా చేయడం ఫుడ్ లవర్స్ కు షాక్ కు గురిచేసింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి చాక్లెట్ ను ప్యాకెట్ నుంచి బయటకు తీశాడు. దానిని పిండిలా కలుపుతూ గుండ్రటి ముద్దలా చేసి పక్కన పెట్టుకున్నారు. తర్వాత కొంచెం మైదాపిండిని తీసుకుని చిన్న చపాతీలా ఒత్తుకున్నాడు. అనంతరం దానిలో ముందుగా కలిపి పెట్టుకున్న చాక్లెట్ మిశ్రమాన్ని వేసి పిండితోనే గుండ్రంగా మూసేశాడు.

చాక్లెట్, మైదాపిండి మిశ్రమాన్ని పరాఠాలా ఒత్తుకుని వేడిగా ఉన్న పెనంపై వేశాడు. కొంత సమయం తర్వాత పరాఠాపై నెయ్యి చల్లాడు. దానిని కాల్చి రెండో వైపు కూడా నెయ్యి వేసి కాల్చుకున్నాడు. అనంతరం దానిని నాలుగు ముక్కలు చేసి ప్లేట్ లో పెట్టి సర్వ్ చేశాడు. అంతే.. ఈ వెరైటీ డిష్ చూసి అక్కడున్న వారందరూ అవాక్కయ్యారు. దీనిపై స్పందించిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహార పదార్థాన్ని ఆరోగ్యంగా ఉంచాలని కోరుతున్నారు. ఇలాంటివి చేసి భారతీయ ఆహారాన్ని అపహాస్యం చేయవద్దని కోరుతున్నారు.ఇన్ స్ట్రాగ్రాంలో ఎప్పుడో పోస్టు చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..  ఇప్పుడు దీనిపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి..

‘చాక్లెట్ పరాఠా’ అనే కొత్త ఫుడ్ క్రేజ్ ఏర్పడింది, సోషల్ మీడియాలో రకరకాల కామెంట్‌లు వస్తున్నాయి. అయితే, ఈ ప్రత్యేకమైన ఫ్యూజన్ వంటకం ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లలో ఆగ్రహాన్ని రేకెత్తించింది.. ఈ పరోటా మసాలా బంగాళాదుంపలు లేదా పనీర్ వంటి పదార్థాలతో నిండి ఉంటుంది. అయినప్పటికీ, సంప్రదాయానికి భిన్నంగా, కొంతమంది ఆహార ప్రియులు చాక్లెట్‌తో సహా తీపి పూరకాలతో ప్రయోగాలు చేయడం ప్రారంభించారు..  

ఈ వీడియోకు లక్ష కంటే ఎక్కువ వ్యూస్, 3,000 లైక్‌లు వచ్చాయి.చాక్లెట్, పరాఠాలను( Paratha, Chocolate ) కలపడం తమకు నచ్చదని కొందరు వ్యాఖ్యానించారు.ఇది తమ ఆహార సంస్కృతిని నాశనం చేస్తుందన్నారు. మరికొందరు వ్యాపారి పరిశుభ్రత గురించి అసంతృప్తిగా ఉన్నారు. అతడు ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు చేతికి తొడుగులు ధరించకపోవడాన్ని నెటిజన్లు గమనించారు. కానీ ప్రతి ఒక్కరూ వీడియోపై నెగిటివ్ కామెంట్స్ చేయలేదు. కొంతమంది చాక్లెట్ పరాఠాను ప్రయత్నించడానికి ఆసక్తిగా ఉన్నామని చెప్పారు.ఇది రుచికరంగా, తీపిగా ఉంటుందేమో అని ఊహించారు.కొందరు వ్యక్తులు పంచదారతో పరాఠాను తయారు చేసిన వారి సొంత అనుభవాలను కూడా పంచుకున్నారు.