చిరుమర్తి మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏముంది.. సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులకు చిక్కని లింగయ్య ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

  • నోటీసులు అందిన వెంటనే మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌!
  • మరో ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో విచారణకు హాజరు
  • ప్లాన్ ప్రకారం ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్చారని పోలీసుల అనుమానం

హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ట్యాపింగ్ ఆధారాలు లభించకుండా అనుమానిత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ప్లాన్లు వేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరహాలో ఫోన్లను మాయం చేస్తున్నారు. సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విచారణకు హాజరైన సమయంలో పోలీసులకు పొంతనలేని సమాధానాలు చెప్తున్నారు. 

ట్యాపింగ్ సమయంలో తాము వినియోగించిన ఫోన్లు పోయాయని, నీళ్లలో పడి పనికిరాకుండా పోయాయనే సమాధానాలు ఇస్తున్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులకు ఇలాంటి సమాధానాలే చెప్పినట్లు తెలిసింది. విచారణకు హాజరయ్యేందుకు సమయం తీసుకుని ఫోన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాయం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే పాత మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డివైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మళ్లీ విచారణకు వారం రోజుల్లోగా హాజరుకావాలని మంగళవారం నోటీసులు జారీ చేశారు.

సిమ్ మరో ఫోన్​లో వేసుకొని..

ఈ కేసులో నిందితులైన మాజీ అడిషనల్ డీఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేటా, వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిట్రీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేటా ఆధారంగా సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధారంగా ఈ నెల 8న చిరుమర్తి లింగయ్యకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల14న విచారణకు హాజరుకావడంతో ఆయనను ప్రశ్నించారు. అసెంబ్లీ ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఉప ఎన్నికల సమయంలో లింగయ్య కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేటా ఆధారంగా పోలీసులు ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆయన మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి సేకరించేందుకు యత్నించారు. ఐతే ట్యాపింగ్ జరిగిన సమయంలో వినియోగించిన ఫోన్ కాకుండా మరొక ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లింగయ్య తీసుకొచ్చినట్లు గుర్తించారు. గతంలో వినియోగించిన ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి ఆరా తీశారు. నోటీసులు అందిన తరువాత తన సిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డును మరో ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వేసుకున్నట్లు గుర్తించారు.

పాత ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మళ్లీ విచారణకు రండి: సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  

నోటీసులు అందిన వెంటనే.. చిరుమర్తి లింగయ్య తన ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డు మరో మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వేసుకుని విచారణకు వచ్చినట్లు గుర్తించారు. ఆయన వద్ద ఉన్న ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ట్యాపింగ్ సమయంలో వినియోగించిన ఫోన్ గురించి ఆరా తీశారు. ఐతే పాత ఫోన్ పాడైందని.. మరో ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనుగోలు చేసి వాడుతున్నానని లింగయ్య చెప్పినట్లు సమాచారం. పక్కా పథకం ప్రకారమే లింగయ్య తన ఫోన్లను మార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే పాత ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో విచారణకు హాజరుకావాలని మళ్లీ నోటీసులు జారీ చేశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాత్రం తన ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డివైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది.