డిసెంబర్ 4న రాత్రి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి (39) అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పలువురిపై కేసు నమోదు చేసిన చిక్కడ పల్లి పోలీసులు.. శుక్రవారం (డిసెంబర్ 13) అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు.
ALSO READ | అల్లు అర్జున్ అరెస్ట్కు కారణమైన ఈ కంప్లైట్ కాపీలో ఏముందంటే..
అరెస్ట్ విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖతో కలిసి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. అల్లు అర్జున్ భార్య స్నేహ, పిల్లలు కూతురు అర్హ, కొడుకు అయాన్ ఇంట్లోనే ఉన్నారు. వారికి చిరంజీవి దంపతులు ధైర్యం చెప్పారు. మరోవైపు, చిరంజీవి సోదరుడు నాగబాబు సైతం అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు.
మొదట అల్లు అర్జున్‌ను అరెస్ట్ విషయం తెలిసి చిరంజీవి అతన్ని పరామర్శించేందుకు చిక్కడ పల్లి పీఎస్‌కు వెళ్తున్నారనే కథనాలు వచ్చాయి. ఇవాళ విశ్వంభర సినిమా షూటింగ్ రద్దు చేసుకొని చిరంజీవి.. అల్లు అర్జున్ చూడటానికి వెళ్తున్నారని వార్తలు వచ్చాయి. ఇవన్నీ పుకార్లని అతని పీఆర్ టీమ్ స్పష్టం చేసింది. టెక్నికల్ ఇష్యూ రావడంతో విశ్వంభర షూటింగ్ క్యాన్సిల్ అయ్యిందని పేర్కొంది.