ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు చిరంజీవి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. చరిత్రలోనే అరుదైన విజయాన్ని అందుకున్న మీకు ముందుగా అభినందనలు అని ట్విట్ తన అధికారిక ఎక్స్ ఖాతా నుంచి ట్విట్ చేశారు. ఈ మహత్తర విజయం, మీ మీద ప్రజలకు ఉన్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, దక్షతకు నిదర్శనమని కొనియాడారు. రాజధాని లేని, గాయపడిన ఆంధ్ర రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నానని రాసుకొచ్చారు. అటు చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో విజయం సాధించారు.