ఆల్బేనియా వేదికగా జరుగుతున్న అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ రెజ్లర్ చిరాగ్ చిక్కారా స్వర్ణం సాధించాడు. సోమవారం(అక్టోబర్ 28) జరిగిన మెన్స్ 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో చిరాగ్.. కిర్గిజ్‌స్థాన్ రెజ్లర్ అబ్దిమలిక్ కరాచోవ్‌పై 4-3 తేడాతో విజయం సాధించి పసిడిని ముద్దాడాడు. ఆఖరి వరకూ నువ్వా.. నేనా అన్నట్లు సాగిన ఈ పోరులో భారత రెజ్లర్ చివరి సెకన్లలో గెలుపును అందుకున్నాడు.
ఈ పసిడితో చిరాగ్ చిక్కారా మరో ఘనతను అందుకున్నాడు. అండర్-23 విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన మూడో భారతీయుడిగా నిలిచాడు. అంతకుముందు అమన్ సెహ్రావత్(మెన్స్ 57 కేజీ ఫ్రీస్టైల్), రీతికా హుడా(ఉమెన్స్ 76 కేజీ ఫ్రీస్టైల్) ఈ ఘనత సాధించారు.
ఈ టోర్నీని భారత్ ఒక స్వర్ణం, ఒక రజతం, ఏడు కాంస్యాలు.. మొత్తం తొమ్మిది పతకాలతో సగర్వంగా ముగించింది.
WE HAVE A NEW WRESTLING WORLD CHAMPION.??
— Sportskeeda (@Sportskeeda) October 27, 2024
Chirag Chikkara wins GOLD in the U23 World Wrestling Championships! ??
He beats Kyrgyzstan's Abdymalik Karachov in Men's 57kg Final!?
Chirag becomes the 2nd Indian male wrestler to win the U23 World Title after Olympic Medallist… pic.twitter.com/moEQDGt8Eh