స్త్రీవిద్యకు కృషి చేసిన మహోన్నతుడు పూలె : చింత ప్రభాకర్

  • సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ 

సంగారెడ్డి టౌన్ ,వెలుగు: స్త్రీ విద్యా వ్యాప్తి కోసం, సబ్బండ వర్గాల ఆర్థిక పురోభివృద్ధికి కృషిచేసిన మహాత్మా జ్యోతిబాపూలే నేటి సమాజానికి ఆదర్శప్రాయమని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. బుధవారం సంగారెడ్డి లోని 31 వార్డులో మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు జ్యోతిబాపూలే అన్నారు. 

వార్డులో అనేక సమస్యలు ఉన్నాయని గతంలో వార్డు అభివృద్ధి కోసం కోటి రూపాయలు మంజూరు చేయించానన్నారు. ప్రభుత్వం మారడంతో మంజూరైన నిధులు రద్దయినట్లు ఎమ్మెల్యే  తెలిపారు. వార్డు అభివృద్ధికి పూర్తి సహాయ సహకారం అందిస్తారని కాలనీవాసులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.  కార్యక్రమంలో నాయకులు కాసాల బుచ్చిరెడ్డి విజయేందర్ రెడ్డి, అనంతయ్య ,బీరయ్య యాదవ్ ,ఆంజనేయులు, అన్వర్, కాలనీవాసులు పాల్గొన్నారు.