చిన్నచింతకుంట రోడ్డుపై పొంచి ఉన్నప్రమాదం

చిన్నచింతకుంట, వెలుగు: కురుమూర్తి రైల్వేస్టేషన్  నుంచి వెంకముపల్లి రోడ్డుపై వెళ్లేందుకు వాహనదారులు జంకుతున్నారు. రద్దీగా ఉండే దేవరకద్ర–అమ్మాపురం వెళ్లే ప్రధాన రహదారిపై నిత్యం రద్దీ గా ఉంటుంది. దీంతో రైల్వే అధికారులు కురుమూర్తి స్టేషన్  సమీపంలో అండర్  గ్రౌండ్  బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఇందులోభాగంగా రైల్వే గేట్  మూసివేశారు. 

వాహనాల రాకపోకల కోసం కురుమూర్తి రైల్వే స్టేషన్  నుంచి వెంకముపల్లి,పేరూరు రోడ్​ వరకు మట్టి రోడ్డు నిర్మించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో పెద్ద గుంతలు పడి నీళ్లు ఆగాయి. నీళ్లు నిలిచి ఉండడంతో గుంతలు తెలియక వాహనదారులు తిప్పలు పడుతున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో వెంటనే రిపేర్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.