కరోనా వ్యాక్సిన్‌‌ను ఎప్పుడు తెస్తారు మోడీ జీ?

కరోనా వ్యాక్సిన్‌‌ను ఎప్పుడు తెస్తారు  మోడీ జీ?
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌‌ను త్వరగా అందుబాటులోకి తీసుకురావడంలో ప్రధాని మోడీ విఫలమయ్యారని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇతర దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీ కూడా మొదలైందని.. మన దేశంలో మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదని విమర్శించారు. ‘ప్రపంచంలో సుమారు 23 లక్షల మంది ప్రజలు కరోనా వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. చైనా, అమెరికా, యునైటెడ్ కింగ్‌‌డమ్, రష్యాల్లో వ్యాక్సిన్ పంపిణీ మొదలైంది. మరి భారత్‌‌లో ఎప్పుడు ప్రారంభిస్తారు మోడీ జీ?’ అని రాహుల్ ట్వీట్ చేశారు. మన దేశంలో ఏ వ్యాక్సిన్‌‌కు కూడా ప్రభుత్వం ఇంకా ఆమోదముద్ర వేయలేదు. అయితే రిపోర్టుల ప్రకారం తెలుస్తున్నది ఏంటంటే.. ఆక్స్‌‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌‌‌‌కు వచ్చే వారంలో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకున్న కోవ్యాక్సిన్‌‌కు అనుమతులు ఇవ్వడంపైనా కేంద్ర సర్కార్ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 23 lakh people in the world have already received Covid vaccinations. China, US, UK, Russia have started… India ka number kab ayegaa, Modi ji? pic.twitter.com/cSmT8laNfJ — Rahul Gandhi (@RahulGandhi) December 23, 2020