చైనా ప్రజల్ని కరోనా వైరస్ వణికిస్తుంది. ఇంటినుంచి భయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఉద్యోగులు సైతం ఇంటికే పరిమితమయ్యారు. వ్యాపార సముదాయాలన్నీ మూతబడ్డాయి. అదే సమయంలో దీన్ని క్యాష్ చేసుకునేందుకు కొంతమంది వ్యాపారస్థులు వినియోగదారుల కు ఆఫర్లు ప్రకటించి సొమ్ము చేసుకుంటున్నారు.
చైనా కు చెందిన ఓషాపింగ్ మాల్ వినియోగదారులకోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. మాల్ కి ఒంటరిగా వచ్చే కుర్రాళ్లు 20నిమిషాలకు కేవలం రూ.10కే గర్ల్ ఫ్రెండ్స్ ని అద్దెకిస్తామని తెలిపింది. అలా మనతో వచ్చిన అమ్మాయిలు షాపింగ్ లో డౌట్స్ ఉన్నా… చిన్నపిల్లల్ని ఆడించడం, షాపింగ్ బ్యాగులు మోస్తుంటారు.
అయితే దీన్ని అదునుగా భావించిన కొంతమంది యువకులు డేటింగ్ కు పంపాలని మాల్ యాజమాన్యాన్ని కోరగా..డేటింగ్ కు పంపిస్తాం. కానీ మాల్ గేటు దాటి భయటకు వెళ్ల కూడదని షరతులు విధించింది. షరతులపై యువకులు నిరాశ చెందుతున్నారు.
