చిలుకూరు బాలాజీ ఆలయం బ్రహ్మోత్సవాలకు రెడీ.. ఆ రోజే స్వామి వారి కళ్యాణం

కొన్ని వందల సంవత్సారాల ఆలయంగా ప్రసిద్ధి గాంచిన చిలుకూరు వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా మేళ తాళాలు, మంగళ వాయిద్యాల మధ్యలో స్వామి వారి కళ్యాణం జరిగేలా ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. కళ్యాణంలో భక్తులు ఒక రూపాయి చెల్లించకుండా పాల్గొనవచ్చని సిబ్బంది సూచించారు. 

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రంగరాజన్ మాట్లాడుతూ 2024, ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 19న ధ్వజారోహణము, ఏప్రిల్ 21  ఆదివారం నాడు రాత్రి 10 గంటలకి స్వామి వారి కళ్యాణం జరగనుందని వెల్లడించారు. ఈ యొక్క కళ్యాణానికి ముఖ్యంగా పెళ్లి కాని వారు సంతానం లేనివారు పాల్గొంటే స్వామివారి అనుగ్రహం వారిపై ఉంటుందని తెలిపారు. 

ఏప్రిల్ 23న రథోత్సవము, ఏప్రిల్ 25న చక్రతీర్థం ఉంటుందని తెలిపారు.  రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులందరి సకల సదుపాయాలను చేపట్టామని చెప్పారు. సీసీ కెమెరాలు నేతృత్వంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారి అనుగ్రహలు పొందాలని సూచించారు.