పిల్లల భవిష్యత్తే దేశభవిష్యత్తు : రాజేశ్​ బాబు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : విద్యార్థులు  బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని జిల్లా జడ్జి రాజేశ్​ బాబు అన్నారు.  గురువారం నాగర్ కర్నూల్ జెడ్పి హైస్కూల్లో  జవహర్‌‌‌‌లాల్‌‌‌‌ నెహ్రూ చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లలకూ  హక్కులు ఉన్నాయని, వాటిని పరీరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సులు, న్యాయ సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు.   విద్యార్థులకు నిర్వహించిన కబడ్డీ, కోకో, క్రికెట్, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సబిత, డీఈఓ గోవిందరాజులు, న్యాయవాదులు పాల్గొన్నారు.