మంచిర్యాల జిల్లాలో ఆరేండ్ల బాలికపై లైంగికదాడి

  • నిందితుడిపై పోక్సో కేసు మంచిర్యాల జిల్లాలో ఘటన

జైపూర్, వెలుగు: ఓ చిన్నారిపై వ్యక్తి లైంగికదాడికి పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. ఎస్ఐ శ్రీధర్ కథనం ప్రకారం..  జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన ఆరేండ్ల బాలిక ఆదివారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన మల్లయ్య (50) ఇంటి సమీపంలో ఆడుకుంటుంది. ఆ బాలికను మల్లయ్య తన ఇంట్లోకి తీసుకెళ్లి  లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

కొద్దిసేపటి తర్వాత చిన్నారి ఏడుస్తూ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్​కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. టెస్టుల కోసం బాలికను మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్ కు పంపినట్టు చెప్పారు.