చిలకలూరిపేట సభలో ప్రధాని మోదీ తెలుగులో ప్రారంభించారు. ఆంధ్రా కుటుంబ సభ్యులందరికి నమస్కారాలు అంటూ ప్రసంగించిన మోదీ ... నిన్ననే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందన్నారు.ఏపీ అభివృద్ది చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు.
కోటప్పకొండ నుంచి మనకు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదం ఉందని ప్రధాని మోదీ అన్నారు. జూన్ 4న వచ్చే ఎన్నికల ఫలితాల్లో ఎన్ డీ ఏ కూటమికి 400 స్థానాలకు పైగా గెలిస్తుందన్నారు. మాకు ఓటేయ్యాలని ప్రధాని తెలుగులో ప్రజలను కోరారు.
చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కష్టపడుతున్నారని మోదీ అన్నారు. ప్రాంతీయ పార్టీలు ఎన్డీఏ కూటమిలో చేరడంతో బలం పెరుగుతుందన్నారు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్దిలో దూసుకుపోతుందన్నారు. ప్రాంతీయ ఆకాంక్షలు... జాతీయ ప్రగతి ఆధారంగానే ఎన్డీఏ ముందుకు వెళ్తుందన్నారు. ఎన్టీఏ ప్రభుత్వం ఎప్పుడూ పేదల కోసమే ఆలోచిస్తుందన్నారు. దేశంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేదల గురించి ఆలోచిస్తుందన్నారు. పదేళ్లలో 30 కోట్ల మంది పేదరికాన్ని జయించారని ప్రధాని మోది అన్నారు. పేదవారికి మంచినీటి సరఫరాను జల్ జీవన్ పథకం కింద ఉచితంగా నల్లా కనెక్షన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు.