కరోనా వైరస్ నుంచి ఇంకా కోలుకోక ముందే… మరో వైపు బర్డ్ ఫ్లూ ముంచుకోస్తుంది. ఇప్పటికే కేరళ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మధ్యప్రదేశ్ మాంద్సౌర్‌లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. ఈ క్రమంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంద్సౌర్ జిల్లా వ్యాప్తంగా 15 రోజుల పాటు చికెన్ సెంటర్లు ముసివేయడంతో పాటు కోడిగుడ్ల అమ్మకాలను నిషేధించారు అధికారులు. మంద్సౌర్ ప్రాంతంలో ఒకే రోజు 100 కాకులు చనిపోవడమే కాక.. ఇక ఇండోర్ ప్రాంతంలో చనిపోయిన కాకుల్లో బర్డ్ ఫ్లూ వైరస్‌ని గుర్తించడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక మరికొన్ని జిల్లాల్లో కూడా బర్డ్ ఫ్లూ మరణాలు బయట పడినట్లు అధికారులు తెలిపారు.
