రాయ్‌పూర్: పెండ్లి చేసుకోకున్నా సరే.. తమ తల్లిదండ్రుల నుంచి పెండ్లి ఖర్చులకు డబ్బు అడగొచ్చని చత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘హిందూ అడాప్షన్స్, మెయింటెనెన్స్ యాక్ట్–1956’ను ఈ సందర్భంగా బిలాస్‌పూర్‌లోని హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రస్తావించింది. చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాకు చెందిన రాజేశ్వరి అనే 35 ఏండ్ల మహిళ వేసిన పిటిషన్‌ను.. జడ్జిలు జస్టిస్ గౌతమ్ బాధురి, జస్టిస్ సంజయ్ ఎస్.అగర్వాల్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాకు చెందిన భాను రామ్.. భిలయ్ స్టీల్ ప్లాంట్(బీఎస్పీ)లో ఉద్యోగి. ఆయన కూతురు రాజేశ్వరి.. ‘హిందూ అడాప్షన్స్, మెయింటెనెన్స్ యాక్ట్-1956’ ప్రకారం తనకు రూ.20 లక్షలను పెండ్లి ఖర్చుల కింద ఇప్పించాలని కోరుతూ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది. ‘‘రెస్పాండెంట్ భాను రామ్ రిటైర్ అయ్యాక రూ.55 లక్షలు ఆయన అందుకోనున్నారు. ఆ డబ్బులో రూ.20 లక్షల దాకా నాకు ఇవ్వాలని ఆదేశిస్తూ రిట్ జారీ చేయండి” అని రాజేశ్వరి పేర్కొంది. అయితే బిడ్డ తన పెండ్లి ఖర్చుల కోసం డబ్బులు అడగొచ్చన్న నిబంధన చట్టంలో లేదంటూ.. పిటిషన్‌ను ఫ్యామిలీ కోర్టు కొట్టేసింది. దీంతో రాజేశ్వరి హైకోర్టును ఆశ్రయించింది. చట్ట ప్రకారం.. పెండ్లి కాని కుమార్తె తన తండ్రి నుంచి వివాహ ఖర్చులను డిమాండ్ చేయొచ్చని రాజేశ్వరి లాయర్ వాదించారు. వాదనలు విన్న హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పిచ్చిందని
