హెడ్ కానిస్టేబుల్ ను సన్మానించిన చేవెళ్ల ఎమ్మెల్యే

చేవెళ్ల, వెలుగు: రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్ కి ఎంపికైన హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఘనంగా సన్మానించారు. ఆదివారం మీర్జాగూడలో హెచ్ కానిస్టేబుల్ ను సన్మానించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. హెడ్ కానిస్టేబుల్ యాదయ్య విధి నిర్వహణలో తన ప్రాణాలను లెక్క చెయ్యకుండా దొంగలను పట్టుకున్నారని గుర్తుచేస్తూ.. ఆయన సేవలు అభినందననీయమన్నారు. రాష్ట్రపతి పతకానికి ఎంపికైన హెడ్ కానిస్టేబుల్ యాదయ్య తన నియోజక వర్గానికి చెందినందున గర్వంగా ఉందని పేర్కొన్నారు. పీసీసీ ప్రచార కార్యదర్శి వసంతం, మాజీ సర్పంచ్ లు భీమయ్య, మాజీ ఉప సర్పంచ్ లు, ప్రభుత్వ ఉద్యోగులు, మండల నేతలు పాల్గొన్నారు.