న్యూ ఇయర్ వేడుకలకు.. రిసార్టులూ పర్మిషన్లు తప్పనిసరి: చేవెళ్ల ఏసీపీ కిషన్

చేవెళ్ల: రిసార్టుల్లో న్యూఇయర్​వేడుకలు నిర్వహిస్తే పర్మిషన్లు తీసుకోవాల్సిందేనని సైబరాబాద్​పోలీసులు ప్రకటించారు. గతంలో రిసార్టులతో పాటు ఫామ్ హౌస్​లో  పర్మిషన్లు లేకుండానే ఈవెంట్లు నిర్వహించేవారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారే అవకాశం ఉండడంతో ఈ ఏడాది కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించారు. చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, శంకర్​పల్లితో పాటు ఇతర ఏరియాల్లోని రిసార్టుల నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని రూల్​పెట్టారు. 

మొయినాబాద్ పరిధిలోని మృగవని, హైదరాబాద్ పోలో హార్స్ రైడింగ్, బాకారం రెవెన్యూలోని డ్రీమ్ వాల్యూ రిసార్టులు అనుమతులు తీసుకున్నాయని చేవెళ్ల ఏసీపీ కిషన్ తెలిపారు. టౌన్, రూరల్​ప్రాంతాల్లో కూడా డ్రంకన్​డ్రైవ్​చేస్తామన్నారు. పబ్లిక్​ప్లేసుల్లో వేడుకలు నిర్వహించినా, మద్యం సేవించినా, రోడ్లను బ్లాక్​చేసి వేడుకలు చేసుకున్నా, ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే కేసులు పెడుతామన్నారు. పటాకులు, డీజేలపై నిషేధం ఉందన్నారు.