బ్రిస్బేన్ వేదికగా గబ్బాలో భారత్, ఆస్ట్రేలియా జట్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్టు ఆడేందుకు సిద్ధమయ్యారు. డిసెంబర్ 14 నుంచి 18 వరకు ఈ టెస్ట్ జరుగుతుంది. తొలి టెస్టులో భారీ విజయంతో భారత్ ఆధిక్యంలోకి వెళ్తే రెండో రెండో టెస్టులో ఆస్ట్రేలియా అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చి సిరీస్ ను 1-1 తో సమం చేసింది. దీంతో మూడో టెస్టులో ఇరు జట్లు ఎలాగైన గెలిచి సిరీస్ లో ఆధిక్యం సంపాదించాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత టెస్ట్ స్పెషలిస్ట్ ఛెతేశ్వర్ పుజారా టీమిండియా ప్లేయింగ్ 11 లో ఒక మార్పు సూచించాడు.
"భారత జట్టులో ఒకే మార్పు జరుగుతుందేమోనని నేను అనుకుంటున్నాను. బ్యాటింగ్ సరిగా లేకపోవడంతో ఆర్ అశ్విన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ కు ఛాన్స్ ఇవ్వడం ఉత్తమం". అని పుజారా అన్నాడు. హర్షిత్ రానా స్థానంలో ఎవరైనా వస్తారా?అనే ప్రశ్నకు.. " హర్షిత్ రాణాను తుది జట్టు నుంచి తప్పిస్తారని నేను అనుకోవడం లేదు. అతను మొదటి మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేశాడు. రెండో మ్యాచ్ లో రాణించలేకపోయాడు". అని పుజారా తెలిపాడు.
Also Read :- భారత క్రికెటర్ సర్జరీ విజయవంతం
పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో వాషింగ్ టన్ సుందర్ కు తుది జట్టులో ఆడే అవకాశం వచ్చింది. సీనియర్లు అశ్విన్, జడేజాను కాదని సుందర్ ఛాన్స్ దక్కించుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో పర్వాలేదనిపించాడు. ఆస్ట్రేలియా లాంటి పేస్ పిచ్ లపై ఆ మాత్రం రాణించడం గొప్ప విషయమే. రెండో టెస్టులో సుందర్ స్థానంలో అశ్విన్ ను తీసుకొచ్చారు. అయితే అశ్విన్ మాత్రం ఆకట్టులేకపోయాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమయ్యాడు. ఆస్ట్రేలియాలో బౌన్సీ పిచ్ లు కావడంతో అశ్విన్, జడేజా, సుందర్ లలో ఒకరికే అవకాశం దక్కనుంది.