రాజ్‌కోట్ : టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారా మైదానంలో బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో అదరగొట్టడం చూశాం. కానీ ఈ సౌరాష్ట్ర ప్లేయర్ బంతితోనూ మెరిసి ఔరా అనిపించాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండో రోజు లెగ్‌స్పిన్నర్ అవతారమెత్తిన పుజారా.. తాను వేసిన రెండో బంతికే ప్రత్యర్థి చివరి బ్యాట్స్‌మన్ మోహిత్ జంగ్రాను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. అనంతరం ఆనందంతో పరుగెత్తుతూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇది పుజారాకు ఆరో ఫస్ట్ క్లాస్ వికెట్‌కాగా.. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఈ రోజు నేను బ్యాట్స్‌మన్ నుంచి ఆల్‌రౌండర్‌గా మారాను’ అనే క్యాప్షన్‌తో పంచుకున్నాడు. అయితే దీనిపై శిఖర్ ధవన్ తనైదన శైలిలో కొనియాడుతూ ట్రోల్ చేశాడు. ‘బాయ్ బాగా బౌలింగ్ చేశావు. కానీ వికెట్ల మధ్య కూడా అప్పడప్పుడూ ఇలానే పరుగెత్తడానికి ప్రయత్నించు’అని సరదాగా టీజ్ చేశాడు. టీమిండియా స్పిన్నర్ అశ్విన్ సైతం పుజారా బౌలింగ్ అద్భుతమని మెచ్చుకున్నాడు.

