కాంగ్రెస్​ పాలనలోనే రైతులకు న్యాయం : ​జీవన్​రెడ్డి

  • మార్కెట్ ​వైస్​ చైర్మన్ ​జీవన్​రెడ్డి

చేర్యాల, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వ  పాలనలోనే రైతులకు న్యాయం జరుగుతోందని చేర్యాల వ్యవసాయ మార్కెట్​ కమిటీ వైస్​ చైర్మన్​ కామిడి జీవన్​రెడ్డి అన్నారు. శనివారం ధూల్మిట్ట మండలంలోని జాలపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతులందరూ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం గిట్టుబాటు ధర అందిస్తోందని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. 

జనగామ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి నాయకత్వంలో చేర్యాల ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. తపాస్​పల్లి రిజర్వాయర్​ ద్వారా చేర్యాల ప్రాంతంలోని అన్ని చెరువులను నింపే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మద్దూరు, ధూల్మిట్ట మండల కాంగ్రెస్​ అధ్యక్షులు పాల్గొన్నారు.