జనవరి 6న చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం

  • వర్చువల్‌‌‌‌గా ప్రారంభించనున్న మోదీ

సికింద్రాబాద్, వెలుగు : ఆదునిక హంగులతో రూపుదిద్దుకున్న చర్లపల్లి రైల్వే టెర్మినల్, చర్లపల్లి రైల్వే స్టేషన్‌‌‌‌ను ఈ నెల 6న ప్రారంభించనున్నారు. తొలుత నవంబర్‌‌‌‌‌‌‌‌ 7న చర్లపల్లి టెర్మినల్‌‌‌‌ను ప్రారంభించాలని నిర్ణయించగా, రోడ్డు విస్తరణ విషయమై బాధితులు కోర్టును ఆశ్రయించడంతో వాయిదా పడింది. ఈ సమస్యను పరిష్కరించిన అధికారులు తిరిగి డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 28న ప్రారంభించాలని ఏర్పాట్లు చేశారు.

అయితే అంతకుముందు రోజు 27న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూయడంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. తాజాగా ఈ నెల 6న ఈ టెర్మినల్‌‌‌‌ను ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌‌‌‌గా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హాజరు కానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.