మాలలే అంబేద్కర్ నిజమైన వారసులు : ఎమ్మెల్యే వివేక్

మాలలే అంబేద్కర్ నిజమైన వారుసులన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఏపీ గుంటూరులో మాలల సింహ గర్జనకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే వివేక్.. మాలలను విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు.. మాలలను విమర్శించే వ్యక్తులపైనే తమ పోరాటం అని చెప్పారు. 

ఆర్టికల్ 341 ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు దళితులకు వ్యతిరేకంగా ఉందన్నారు వివేక్ .  రిజర్వేషన్లపై సుప్రీం జడ్జి మెంట్ కొందరికే అనుకూలమని చెప్పారు. సుప్రీం తీర్పుపై సుప్రీం కోర్టులోనే కొట్లాడుతామన్నారు. క్రిమిలేయర్ ను ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. దళితులకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు .దీనిపై మాలలు రాజకీయంగా కొంట్లాడాల్సిందేనన్నారు ఎమ్మెల్యే వివేక్.

మాలలు ధమ్ము ధైర్యం చూపించాలన్నారు ఎమ్మెల్యే వివేక్. మాలల దమ్ము ఏంటో ఈ మీటింగ్ తో తెలుస్తోంది.. తెలంగాణలో మాలల సత్తా ఏంటో చూపించాం... మాలల సత్తా ఏంటో ఈ  రెండు మీటింగ్ లే చెబుతున్నాయన్నారు.  అంబేద్కర్ లేకుంటే రిజర్వేషన్లు లేవన్నారు వివేక్ . వెనుక బడ్డ వర్గాలకు అంబేద్కర్ రిజర్వేషన్లు ఇచ్చారని తెలిపారు. దళితులను కాపాడటమే అంబేద్కర్ ఏకైక లక్ష్యమన్నారు. అంబేద్కర్ మాల, మాదిగ అని తేడా చూడలేదన్నారు వివేక్.   దళితుల కోసం రాత్రింబవళ్లు  కష్టపడ్డారని చెప్పారు.

కొందరు  దళితుల్లో చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నారని.. ఈ కుట్రను తిప్పి కొట్టే వరకు పోరాటం ఆగబోదన్నారు ఎమ్మెల్యే వివేక్.    మాలలపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే వివేక్ . మాలలు ఎవరికీ అన్యాయం చేయలేదని..కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు.  మాలల  సెల్ఫ్ రెస్పెక్ట్ ను కించ పరిచేప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మాలలు నిరంతర పోరాటం చేయాలని పిలుపునిచ్చారు వివేక్.