యాదవుల సమస్యలు పరిష్కరించండి: సీఎంకు చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేల విజ్ఞప్తి

చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు గడ్డం వివేక్ వెంకటస్వామి, వినోద్ నేతృత్వంలో అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్ సదానందం యాదవ్ ఆధ్వర్యంలో యాదవులు అసెంబ్లీ చాంబర్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. 

మంచిర్యాల జిల్లాలో రెండో విడత 7,833 మంది గొర్రెల యూనిట్ల కోసం డీడీలు కడితే.. అప్పటి బీఆర్ఎస్ సర్కార్ కేవలం 700 యూనిట్లు మాత్రమే కేటాయించి, మిలిగిన వారికి ఇవ్వకుండా మోసం చేసిందని ముఖ్యమం త్రి దృష్టికి తీసుకవచ్చారు. 

ALSO READ | భూ భారతితో ప్రతి ఎకరాకూ భద్రత

బీఆ ర్ఎస్ సర్కార్ మూడేండ్లు తమ డబ్బులు వాడుకొని అసలు, వడ్డీ కూడా జాప్యం చేసిందని, కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వా తనే తాము కట్టిన డబ్బులు వచ్చాయన్నారు.