- రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న 19,300 మంది సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి అన్నారు. సోమవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్ లో చిన్నారెడ్డితో సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ప్రతినిధులు భేటీ అయ్యారు. సమస్యల పరిష్కారం కోసం వారం రోజుల నుంచి సమ్మె చేస్తున్న తమకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలా చర్యలు తీసుకోవాలని వారు చిన్నారెడ్డిని కోరారు.
సమగ్ర శిక్ష ఉద్యోగులందరిని విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, అప్పటివరకు ఉద్యోగ భద్రతతో కూడిన పే స్కేల్ ఇవ్వాలని, ఉద్యోగుల రీఎంగేజ్ విధానాన్ని తీసివేయాలని, ప్రతి ఉద్యోగికి బీమా సౌకర్యం కల్పించాలని పదవీ విరమణ చేసిన వారికి బెనిఫిట్స్ ఇవ్వాలని వా రు చిన్నారెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.