40 ఏళ్ల హోటల్ చరిత్ర.. చెన్నై వాళ్లకు అడ్రస్ అడ్డా.. నిలువునా కూల్చేస్తున్నారు..

40 ఏళ్ల హోటల్ చరిత్ర.. చెన్నై వాళ్లకు అడ్రస్ అడ్డా.. నిలువునా కూల్చేస్తున్నారు..

చెన్నైలోని అత్యంత ప్రసిద్ధ హోటళ్లలో ఒకటైన క్రౌన్ ప్లాజా చెన్నై అడయార్ పార్క్ డిసెంబర్‌లో మూతపడనుంది. నవంబర్ 21న తన 38 సంవత్సరాల జర్నీకి ముగింపు పలకనున్నట్టు హోటల్ తన కస్టమర్లకు ప్రకటించింది. మిశ్రమ భావోద్వేగాలతో మేము డిసెంబర్ 20 నుంచి అతిథి రాకపోకలకు స్వస్తి పలకనున్నట్లు ప్రకటిస్తున్నాం.. ఈ ముఖ్యమైన అప్ డేట్.. బిల్డింగ్ ను మళ్లీ నిర్మించాలనే యాజమాన్య సంస్థ నిర్ణయం నుంచి వచ్చింది అని తెలిపింది. ఈ క్రమంలోనే నివాస సముదాయం కోసం క్రౌన్ ప్లాజాను కూల్చివేస్తామని కూడా చెప్పింది.

హోటల్ 1981లో ప్రారంభించబడినప్పుడు దీన్ని హాలిడే ఇన్ అని పిలిచేవారు. ఆ తర్వాత వివిధ పేరు మార్పులకు దారితీసింది. అయితే ఈ హోటల్‌ను చెన్నైవాసులు రెండు పేర్లతో పిలుస్తారు: పార్క్ షెరటన్ లేదా పాత మోనికర్ అడయార్ గేట్ హోటల్. 2015లో, ఈ పేరు మళ్లీ క్రౌన్ ప్లాజా చెన్నై అడయార్ పార్క్‌గా మార్చబడింది.

కస్టమర్‌లకు వారికి అందించిన ప్రకటనలో.. గత 38 సంవత్సరాలుగా, మా దిగ్గజ హోటల్, ప్రఖ్యాత రెస్టారెంట్ కు అనేక మంది అతిథులు, ఈవెంట్‌లను హోస్ట్ చేసిన ప్రత్యేకతను కలిగి ఉన్నాయి, ఇది గొప్ప వారసత్వానికి దోహదం చేస్తుంది. మేము మీ మద్దతును హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం అని హోటల్ యాజమాన్యం తెలిపింది.