ఐపీఎల్ లో అత్యంత ఫాలోయింగ్ ఉన్న జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. దీనికి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్టుగా పేరున్న చెన్నై జట్టు 5 ఐపీఎల్ టైటిల్స్ తమ ఖాతాలో వేసుకుంది. 2025 ఐపీఎల్ కు ప్లేయర్లు మారనున్నారు. ఈ సారి మెగా ఆక్షన్ కావడంతో తమ ప్లేయర్లను రిటైన్ చేసుకునే పనిలో బిజీగా ఉంది. ఒకసారి చెన్నై రిటైన్ చేసుకునే ఆటగాళ్లను ఒకసారి పరీశీలిస్తే..
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ ఈ సారి అన్‌క్యాప్డ్ ప్లేయర్ గా బరిలోకి దిగడం దాదాపుగా ఖాయమైంది. అతని కోసమే పాత రూల్ ను మళ్ళీ ఐపీఎల్ లో ప్రవేశ పెట్టినట్టు తెలుస్తుంది. అదే జరిగితే ధోనీకి అన్‌క్యాప్డ్ కేటగిరిలో రూ. 4 కోట్ల ఐపీఎల్ శాలరీ దక్కుతుంది. ధోనీ లాంటి స్టార్ ప్లేయర్ కు ఇది చాలా చిన్న మొత్తం అయినా.. అతనికిదే దాదాపుగా చివరి ఐపీఎల్ కావడంతో రిటైన్ ప్లేయర్ గా తాను చెన్నై జట్టులోకి వెళ్ళడానికి ఆసక్తి చూపించట్లేదని సమాచారం.
ప్రస్తుతం చెన్నై జట్టులో సీనియర్.. స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న జడేజాకు రూ. 18 కోట్ల రూపాయలు ఇచ్చి మొదటి రిటైన్ గా తీసుకునే అవకాశం ఉంది. జడేజాను తప్పిస్తే తొలి రిటైన్ ఆటగాళ్లు ఎవరూ లేరు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కు రూ.14కోట్లు ఇచ్చి రెండో రిటైన్ ప్లేయర్ గా తీసుకోవడం గ్యారంటీ. కెప్టెన్ గా కొనసాగుతున్న గైక్వాడ్.. నాలుగేళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మూడో రిటైన్ ప్లేయర్ విషయంలో కాస్త గందరగోళం నెలకొన్నా పతిరాణా చెన్నైకు బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నాడు.
నాలుగు, ఐదు రిటైన్ ప్లేయర్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ.14 కోట్లు ఇవ్వాల్సి ఉంది. దీంతో చెన్నై ఇంత భారీ మొత్తం ఇచ్చే సాహసం చేయకపోవచ్చు. జడేజా, గైక్వాడ్, పతిరానా రిటైన్ ప్లేయర్లుగా ధోనీ అన్‌క్యాప్డ్ ప్లేయర్ గా చెన్నై జట్టులో ఉండే అవకాశముంది. దూబే, కాన్వే, దీపక్ చాహర్, శార్దూల ఠాకూర్ లను RTM కార్డు ద్వారా తీసుకునే ఉద్దేశ్యంలో ఉంది.
PURSE FOR RETENTION.
— ?????? (@SergioCSKK) September 28, 2024
1st Retention - 18 Cr
2nd Retention - 14 Cr
3rd Retention - 11 Cr
4th Retention - 18 Cr
5th Retention - 14 Cr
Realistically speaking CSK should only retain 3 players and dhoni in uncapped. Giving 18crores and 14crores in 4th and 5th spot will just ruin. pic.twitter.com/F2ojVNBgXa