విగ్గుతో గోల్డ్, విదేశీ కరెన్సీ స్మగ్లింగ్

విగ్గుతో గోల్డ్, విదేశీ కరెన్సీ స్మగ్లింగ్

ప్రత్యేక విమానాల్లో దుబాయి, షార్జా నుంచి చెన్నైకి అక్రమంగా తీసుకొచ్చిన రూ.2.53 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై ఎయిర్ పోర్టుకు దుబాయి,  షార్జా నుంచి ఆదివారం రెండు ప్రత్యేక  విమానాలు వచ్చాయి. అందులో ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. చెన్నై, తిరుచ్చి, రామనాథపురం, విళుపురం, సేలం జిల్లాలకు చెందిన ఏడుగురు వ్యక్తులపై అనుమానంతో ప్రత్యేకంగా సోదా చేయగా బంగారంతో పాటు తల విగ్గు, సాక్సుల్లో దాచిన బంగారం పేస్టును గుర్తించారు. మొత్తం రూ.2.53 కోట్ల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిని అరెస్టు చేశారు.