తిరుమల శ్రీవారికి ముస్లిం దంపతుల భారీ విరాళం

తిరుమల శ్రీవారికి ముస్లిం దంపతుల భారీ విరాళం

తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన సుబీనా బాను, అబ్దుల్ ఘనీ దంపతులు కోటి రూపాయలు విరాళమిచ్చారు. తమ పిల్లలతో కలిసి తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో విరాళం చెక్కును TTD EO ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.15 లక్షలు, ఇటీవల తిరుమలలో ఆధునికీకరించిన శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో నూతన ఫర్నిచర్, వంటశాలలో పాత్రకు 87 లక్షలు తిరుమల శ్రీవారికి రూ. కోటి విరాళమిచ్చారు. అంతకు ముందు అబ్దుల్ ఘనీ దంపతులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.