తాగునీటి  కోసం చెంచుపెంటలో అవస్థలు

అమ్రాబాద్, వెలుగు:  వేసవిలో తాగునీరు అందక చెంచులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  పదర మండలం పిల్లిగుండ్ల చెంచుపెంటలో పది రోజులుగా భగీరథ నీరు రావడం లేదని ఆవేదన చెందుతున్నారు.

నీటి కోసం దట్టమైన అడవిలో నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణానది వద్దకు వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉందన్నారు. అధికారులు స్పందించి తమకు తాగునీరు అందించాలని వారు కోరుతున్నారు.