నిమ్స్‌‌‌‌‌‌‌‌ నుంచి ఈశ్వరమ్మ డిశ్చార్జ్‌‌‌‌‌‌‌‌

  •     రూ. లక్ష చెక్‌‌‌‌‌‌‌‌ అందజేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు

నాగర్‌‌‌‌‌‌‌‌ కర్నూల్‌‌‌‌‌‌‌‌, వెలుగు : నాగర్‌‌‌‌‌‌‌‌ కర్నూల్‌‌‌‌‌‌‌‌ జిల్లా కొల్లాపూర్‌‌‌‌‌‌‌‌ మండలం మొలచింతలపల్లికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని నిమ్స్‌‌‌‌‌‌‌‌ నుంచి డిశ్చార్జ్‌‌‌‌‌‌‌‌ అయింది. కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేయడంతో గాయపడిన ఈశ్వరమ్మకు నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌ జిల్లా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అందించారు.

అనంతరం మెరుగైన ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కోసం మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావుల ఆదేశాలతో ఇటీవల హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని నిమ్స్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. ఈశ్వరమ్మ ప్రస్తుతం కోలుకోవడంతో ఆమెను హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ నుంచి డిశ్చార్జ్‌‌‌‌‌‌‌‌ చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్‌‌‌‌‌‌‌‌ జర్నలిస్ట్‌‌‌‌‌‌‌‌ పాశం యాదగిరి, డి.జితేందర్‌‌‌‌‌‌‌‌ తదితరులు నిమ్స్‌‌‌‌‌‌‌‌లో ఈశ్వరమ్మను పరామర్శించారు.

రూ. లక్ష చెక్‌‌‌‌‌‌‌‌ అందజేత

మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం నిమ్స్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ఈశ్వరమ్మను కలిసి రూ. లక్ష చెక్‌‌‌‌‌‌‌‌ అందజేశారు. మరో రూ. 3 లక్షలను త్వరలోనే అందజేస్తామని చెప్పారు. ఈశ్వరమ్మ పిల్లల చదువు ఖర్చును సైతం ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.