ఈఫిల్‌ టవర్‌ కన్నా ఎత్తులో… దేశంలో రైల్వే బ్రిడ్జ్‌ నిర్మాణం

ఈఫిల్‌ టవర్‌ కన్నా ఎత్తులో… దేశంలో రైల్వే బ్రిడ్జ్‌ నిర్మాణం

జమ్మూ కశ్మీర్‌ : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని జమ్మూ కశ్మీర్‌లోని చినాబ్‌ నదిపై నిర్మిస్తున్నారు. ఈఫిల్‌ టవర్‌ కన్నా ఎత్తులో.. భారత ఇంజనీరింగ్‌ గొప్పదనాన్ని తెలియజేసేలా ఈ బ్రిడ్జి నిర్మాణం జ‌రిగింద‌ని, భారత రైల్వే నిర్మాణంలో ఈ బ్రిడ్జి ఓ మైలు రాయి కాబోతుందని కేంద్రమంత్రి పీయూశ్‌ గోయల్‌ ట్విటర్‌ వేదికగా చెప్పారు.

కశ్మీర్‌ ప్రాంతానికి రైల్వే లైన్‌ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రైల్వే మార్గం వేస్తున్నారు. 476 మీటర్ల పొడవైన ఈ వంతెనను ఉక్కుతో నిర్మిస్తున్నారు. మొత్తం బ్రిడ్జి పొడవు 1,315 మీటర్లు కాగా.. దీనికయ్యే వ్యయం రూ.1,250 కోట్లు. ఉద్దంపూర్‌-శ్రీనగర్‌- బరాముల్లా రైల్వే మార్గం (111 కిలోమీటర్లు)లో నిర్మితమవుతున్న ఈ వంతెన‌ మార్చి క‌ల్లా ప్రారంభానికి సిద్ధం కానుంది. జమ్మూ కశ్మీర్‌లోని బక్కల్‌, కౌరి మధ్య చీనాబ్‌ నదిపై సంధానంగా ఉంటుంది. ఈ వంతెనను జమ్మూ కశ్మీర్‌లోని యుఎస్‌బిఆర్‌ఎల్‌ ప్రాజెక్ట్‌ కత్రా-లావోలి విభాగం నిర్మిస్తోంది.