అక్కడ అలా..
హంగేరికి చెందిన చెఫ్ బర్నబాస్ వుజిటీ–జీసొల్నే. ఇతనికి ఆన్ లైన్లో గేమ్ ఆడడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్‌తోనే గిన్నిస్ రికార్డ్ సాధించాడు.
ఎమ్.ఎమ్.ఒ.ఆర్.పి.జి. (మాసివ్ మల్టీప్లేయర్ ఆన్లైన్ రోల్ – ప్లేయింగ్ గేమ్)లో లాంగెస్ట్ వీడియో గేమ్ మారథాన్ 59 గంటల 20 నిమిషాలు ఆడాడు. అంటే.. దాదాపు రెండున్నర రోజులు అదేపనిగా ఈ గేమ్ ఆడాడన్నమాట. దీంతో అంతకుముందున్న 23 గంటల 31 నిమిషాల రికార్డ్ బ్రేక్ చేశాడు. ఈ సాహసం చేసేటప్పుడు తన ఆటనే కాకుండా అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ ఆటలో కూడా పార్టిసిపేట్ చేశాడు. 30 గంటలు ఆడాక విసుగొచ్చేసిందట.
45 గంటల తర్వాత హాలూసినేషన్కి కూడా గురయ్యాడట! ఈ మొత్తం ప్రాసెస్‌లో గంటకు ఐదు నిమిషాలు మాత్రమే రెస్ట్ తీసుకున్నాడట! ఆ టైంలో తినడం, నిద్రపోవడం లేదా వాష్ రూమ్‌కి వెళ్లడం వంటివి చేశాడు. ఆడేటప్పుడు అలసటగా అనిపిస్తే కాఫీ తాగకుండా నీళ్లను మాత్రమే తాగాడు. ఈ ఫీట్ మొత్తంలో15 లీటర్ల నీళ్లు తాగాడు ఆన్లైన్ గేమర్ బర్నబాస్.
ఇలాంటి సాహసాలు చేయడం బర్నబాస్కు కొత్తేం కాదు.
ఇంతకుముందు ‘వరల్డ్ ఆఫ్ వార్ క్రాఫ్ట్’ అనే గేమ్‌లో పదేండ్ల నుంచి ఆడుతున్నాడు. టీనేజర్ కాబట్టి మామూలు రోజుల్లో పది గంటలు, వీకెండ్స్‌లో16 గంటలు ఆడడం ఇతనికి అలవాటే. ప్రస్తుతం ఈ అటెంప్ట్‌తో బర్నబాస్ లాంగెస్ట్ ఎమ్.ఎమ్.ఒ.ఆర్.పి.జి. మారథాన్, లాంగెస్ట్ వరల్డ్ ఆఫ్ వార్ క్రాఫ్ట్ మారథాన్స్‌లో ఛాంపియన్‌గా నిలిచాడు. బర్నబాస్ ఈ రికార్డ్ కోసం చేసిన ఈ అడ్వెంచర్ మిగతా వాళ్లకు ఉపయోగపడుతుంది. అదెలాగంటే.. తను ఆడిన గేమ్ అంతా లైవ్ స్ట్రీమింగ్ అయింది.ఈ ఫీట్ చేయడానికి వీలు కల్పించిన వెబ్ సైట్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వచ్చే డబ్బును ఛారిటీ కోసం వాడాలని డిసైడ్ అయింది.
ఇక్కడ ఇలా..
కర్ణాటకలో బెంగళూరులోని ఓ ఫుడ్ సంస్థ ప్రపంచంలోని అతి పొడవైన దోశ తయారు చేసి రికార్డుకెక్కింది. తమ సంస్థ100వ వార్షికోత్సవంలో భాగంగా ఈ భారీ దోశను మార్చి15న తయారుచేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దోశ తయారీ వీడియోను చెఫ్ రెజీ మాథ్యూ షేర్ చేశారు. దోశ తయారీలో మొత్తం 75మంది చెఫ్‌లు పాల్గొన్నారు. అంతా కలిసి123 అడుగుల భారీ దోశ తయారు చేశారు.
దాంతో ఇది ప్రపంచంలో అతి పొడవైన దోశగా రికార్డ్‌కి ఎక్కింది. దీన్ని తయారుచేసిన చెఫ్‌లకు గిన్నిస్ సర్టిఫికెట్ అందించారు. ఈ దోశ తయారీ కోసం110 సార్లు ట్రై చేశారట! చివరికి సక్సెస్ అయ్యారు. పొడవాటి దోశ తయారీ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే వేల మంది చూశారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది ఈ వీడియో.