ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు ప్రతి ఏడాది వార్షిక వడ్డీ వారి పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంటుంది. ఆ వడ్డీ మొత్తం , తమ ఖాతాలో మొత్తం ఎంత డబ్బు ఉందో తెల్సుకోవడానికి 4 సులభమైన మార్గాలను కేంద్రప్రభుత్వం అందుబాటులో ఉంచింది. రిజిస్టర్ అయిన ఫోన్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా.. మీ ఫోన్ నుంచి SMS పంపడం ద్వారా… పీఎఫ్ వెబ్ సైట్ ను లాగిన్ చేయడం ద్వారా ప్రతి ఉద్యోగి తమ ఖాతాలో జమ అయిన మొత్తం, వడ్డీ మొత్తం వివరాలను తెల్సుకోవచ్చు.
మిస్డ్ కాల్ ఇవ్వాలంటే..
-ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో నమోదైన ఉద్యోగులు.. తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి.. ప్రభుత్వం సూచించిన ఫోన్ నంబర్ కు మిస్డ్ కాల్ ఇస్తే.. మొబైల్ ఫోన్ కు ఆ వివరాలు మెసేజ్ రూపంలో వస్తాయి. ఇందుకోసం.. ఖాతాదారులు.. తమ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి.. 011-22901406 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. పీఎఫ్ నంబర్ సహా.. బ్యాలెన్స్, వడ్డీ మొత్తం వివరాలతో ఫోన్ కు మెసేజ్ వస్తుంది.

SMS ద్వారా…
-రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ నుంచి.. ఒక కచ్చితమైన ఫార్మాట్ తో మెసేజ్ చేసి పీఎఫ్ వివరాలు తెల్సుకోవచ్చు. EPFOHO UAN అని టైప్ చేసి… 77382 99899 నంబర్ కు టెక్స్ట్ మెసేజ్ చేయాలి. పీఎఫ్ బ్యాలెన్స్, వడ్డీ మొత్తం వివరాలు నంబర్ తో సహా మొబైల్ కు మెసేజ్ వస్తాయి.
వెబ్ సైట్ లో లాగిన్ అవ్వడం ద్వారా..
-గూగుల్ లో Employee Provident Fund Organisation web site కి వెళ్లాలి. ఈపీఎఫ్ వెబ్ సైట్ https://www.epfindia.gov.in/site_en/index.php లింక్ క్లిక్ చేయండి.
-ఆ తర్వాత Our Services మెనూలో.. రెండో సబ్ మెనూ For Employees ను క్లిక్ చేయాలి.
-సర్వీసెస్ లో Member Passbook లింక్ పైన క్లిక్ చేయాలి.
-కొత్త పేజీలో.. UAN, మీ పీఎఫ్ పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి.
–https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login కి లాగిన్ ఐన తర్వాత… అక్కడ మీ పీఎఫ్ ఖాతాలో ఇప్పటివరకు ఉన్న ప్రావిడెంట్ ఫండ్ మొత్తం, వడ్డీ మొత్తాన్ని వివరంగా చూడొచ్చు. Pdf ఫార్మాట్ లో ఫైల్ డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు.
Note: Unified Member Portal లో రిజిస్టర్ అయిన వారికే… ఈపీఎఫ్ వెబ్ సైట్ లోకి లాగిన్ అయ్యే వీలు ఉంటుంది.
మొబైల్ యాప్ ద్వారా..
-కేంద్రప్రభుత్వం మొబైల్ యాప్ ను కూడా అందుబాటులో ఉంచింది. EPFO Umang platform app లో లాగిన్ అయి… ఈపీఎఫ్ ఖాతాలో మొత్తం, వడ్డీ మొత్తం డీటెయిల్స్ తెల్సుకోవచ్చు.

