ట్రేడ్ మార్కెటింగ్ పేరుతో ఫ్రాడ్ ..హైదరాబాద్ లో మహిళ నుంచి రూ. 4.49 లక్షలు కొట్టేసిన చీటర్స్

బషీర్ బాగ్ - వెలుగు :  ట్రేడ్ మార్కెటింగ్ లో ఇన్వెస్ట్​ చేయాలని హైదరాబాద్ కు చెందిన మహిళను  సైబర్ చీటర్స్ మోసగించారు. మొదట నమ్మకం కలిగించేందుకు కొంత మేర లాభాలు ఇచ్చి , ఆపై పెద్ద మొత్తంలో డబ్బులను కాజేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివ మారుతి తెలిపిన  ప్రకారం...  ఇన్వెస్ట్​ మెంట్​ స్కీమ్​ అంటూ సైబర్ చీటర్స్ మహిళకు వాట్సాప్ లో మెసేజ్ పంపించారు. మొదట సోషల్ మీడియా  టాస్క్ లు ఇచ్చారు. దానికి   మొదట్లో  120, 300 రూ   చెల్లించారు. దీనితో బాధితురాలికి నమ్మకం కలిగింది. 

అనంతరం ఆమె వాట్సాప్ కు ఓ లింక్ ను పంపించి అకౌంట్ ను క్రియేట్ చేశారు. అందులో మొదట రూ 1,000 ఇన్వెస్ట్ చేయడంతో వెంటనే రూ 1,300 చెల్లించారు. అలా  చిన్న  మొత్తంలో ఇన్వెస్ట్​ చేయిస్తూ... భారీగా ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపారు. దీనితో మహిళ రూ. 4,49,740 ఇన్వెస్ట్ చేసింది. అనంతరం స్కామర్లు ఆమెకు డబ్బులు పంపించకుండా , ఇంకా ఇన్వెస్ట్ చేయాలని అప్పుడే లాభాలతో పాటు చెల్లిస్తామని బుకాయించారు. తాను మోసపోయానని గ్రహించిన మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.