నల్లమల అడవిలో నాటుసారా డెన్

నల్లమల అడవిలో నాటుసారా డెన్

చీప్ లిక్కర్ తయారీ దారులు నల్లమల అడవిలో ఏర్పాటు చేసుకున్న నాటుసారా డెన్ ను స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో పోలీసులు వెలుగులోకి తెచ్చారు. ఓ వైపు సీసీ కెమెరాల నిఘా.. ఇంకో వైపు దాడులతో బెంబేలెత్తిపోయి అడవిబాట పట్టినట్లు గుర్తించారు. కర్నూలు జిల్లా మహానంది కి సమీపంలో.. బండి ఆత్మకూరు మండలం నారపురెడ్డి కుంట దగ్గర మనుషులు సంచరిస్తున్నట్లు అడుగుజాడలున్నాయన్న పశువుల కాపరుల సమాచారంతో స్పెషల్ పోలీసులు అలర్టయ్యారు. అటవీశాఖ సహాయంతో ఎస్.ఈ.బీ సీఐ లలితాదేవి పశువుల కాపరిలా మారింది. రహస్యంగా సంచరిస్తున్న వారిని గుర్తించి అనుమానం రాకుండా వెంబడించి అడవిలోకి వెళ్తే అడవిలో ఆరు కిలోమీటర్ల లోపల ఏర్పాటు చేసుకున్న స్థావరం కనిపించింది. మరుసటి దినం పోలీసు బలగాలతో కలసి పశువుల కాపరుల్లా మారి అడవిలోకి వెళ్లి నాటుసారా స్థావరానికి వెళ్లేలోపల వారు గుర్తుపట్టి పరారయ్యారని సీఐ లలితాదేవి చెప్పారు. మొత్తం  1400 లీటర్లకుపైగా నాటుసారా బెల్లం ఊటను గుర్తించి.. బట్టీలను ధ్వంసం చేశామని తెలిపారు.