SA vs ENG: అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లాండ్ మహిళా స్పిన్నర్ హ్యాట్రిక్

ఇంగ్లండ్ మహిళా ఆల్ రౌండర్ చార్లీ డీన్ వన్డేల్లో హ్యాట్రిక్ సాధించింది. డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ఆదివారం (డిసెంబర్ 8) ఆదివారం ఆమె ఈ ఘనత సాధించింది. 25 ఏళ్లలో ఇంగ్లాండ్ తరపున మహిళల వన్డేల్లో తొలి సారి హ్యాట్రిక్ సాధించిన ప్లేయర్ గా డీన్ నిలిచింది. ఓవరాల్ గా ఇంగ్లాండ్ వన్డే చరిత్రలో ఇది మూడో హ్యాట్రిక్. అంతకముందు కరోల్ హోడ్జెస్, క్లేర్ కానర్‌లు మాత్రమే ఇంగ్లాండ్ తరపున వన్డేల్లో హ్యాట్రిక్ పడగొట్టారు. 

1993లో డెన్మార్క్‌తో జరిగిన మ్యాచ్‌లో హాడ్జెస్ ఈ ఫార్మాట్‌లో హ్యాట్రిక్ సాధించిన మొదటి ఇంగ్లీష్ మహిళా క్రీడాకారిణి. ఆ తర్వాత కానర్ 1999లో భారత్‌తో జరిగిన వన్డేలో హ్యాట్రిక్ సాధించింది. 25 ఏళ్ళ తర్వాత ఇంగ్లాండ్ తరపున చార్లీ డీన్ వన్డేల్లో హ్యాట్రిక్ సాధించి అదరహో అనిపించింది. ఆమె రెండు ఓవర్లలో తన హ్యాట్రిక్ పూర్తి చేసుకుంది. ఇన్నింగ్స్ 17వ ఓవర్ చివరి బంతికి మారిజాన్ కప్ ను ఔట్ చేసిన ఆమె.. 19 ఓవర్ తొలి రెండు బంతులకు నాడిన్ డి క్లెర్క్, సినాలో జాఫ్తా లను డకౌట్ చేసి వరుసగా మూడు వికెట్లు పడగొట్టింది. 

ALSO READ | SA vs SL, 2nd Test: ఊహించని అద్భుతం: సౌతాఫ్రికా వికెట్ కీపర్ సంచలన క్యాచ్

ఈ మ్యాచ్ లో మొత్తం 10 ఓవర్లలో 45 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ 6 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 135 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 24 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసి గెలిచింది.