- కలెక్టర్ క్రాంతి వల్లూరితో ఎల్గొయి గ్రామస్తులు
రాయికోడ్ / ఝరాసంగం, వెలుగు : నిమ్జ్ కు రెండో విడతలో తాము భూములు ఇస్తే ఊరిని వదిలి ఎక్కడికో వెళ్లాల్సి వస్తోందని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఎల్గొయి, చీలపల్లి గ్రామాల రైతులు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరితో మొరపెట్టుకున్నారు. నిమ్జ్ ప్రాజెక్టులో ఏర్పాటు చేసే వెమ్ టెక్నాలజీ కంపెనీ ఎండీ, హుండాయ్ కంపెనీ ప్రతినిధులతో కలిసి నిమ్ఙ్ ప్రాజెక్టును గురువారం కలెక్టర్ క్రాంతి వల్లూరి సందర్శించారు. ఇప్పటికే ఎల్గొయి గ్రామానికి సంబంధించి మొదటి విడతలో 2వేలు ఎకరాల భూమి నిమ్జ్‌లో పోయిందని, ఇక రెండో విడత భూ సేకరణ చేస్తే తాము ఆగమవుతామని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే నిమ్జ్‌లో భూములు కోల్పోయిన రైతులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని చీలపల్లి గ్రామస్తులు కలెక్టర్ కు విన్నవించారు. నిమ్జ్‌కు వెళ్లే రోడ్లకు మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతకు ముందు న్యాల్కల్ మండలం డప్పూర్ , మల్గి, వడ్డి శివారులో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ కోసం భూ సేకరణ ను ఆమె పరిశీలించారు. ఆలయాలకు కేటాయించిన భూములను పరిశ్రమకు తీసుకోవద్దని కలెక్టర్‌కు ఆయా గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు విన్నవించారు.
అనంతరం మునిపల్లి మండలం లింగంపల్లి గురుకుల పాఠశాలను ఆ కస్మికంగా తనిఖీ చేసి పరిశుభ్రంగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు తరగతి గదులను పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రాజు, నిమ్జ్ స్పెషల్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి, ఇండ్రస్ర్టిస్ చీప్ మేనేజర్ రతన్ రాథోడ్, ఆయా మండలాల తహసీల్దార్లు, అధికారులు తదితరులు ఉన్నారు.