నేషనల్​ సైక్లింగ్ పోటీలకు చరితారెడ్డి క్వాలిఫై

ఎల్బీనగర్, వెలుగు: నేషనల్ ​లెవల్​ సైక్లింగ్ పోటీలకు కర్మన్ ఘాట్​కు చెందిన చరితారెడ్డి ఎంపికైంది. మేడ్చల్​ జిల్లా కీసరలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్– 14 విభాగం ఎస్ జీఎఫ్ సైక్లింగ్ పోటీల్లో చరితారెడ్డి గోల్డ్ మెడల్ సాధించి త్వరలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు క్వాలిఫై అయ్యింది.

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ముషిపట్ల గ్రామానికి చెందిన ఫైళ్ల నరేందర్ రెడ్డి, ఝాన్సీ దంపతులు జీవనోపాధి కోసం సిటీకొచ్చి కర్మన్ ఘాట్ లో ఉంటున్నారు. మీర్ పేట శ్లోక స్కూల్​లో వీరి కూతురు చరితారెడ్డి 7వ తరగతి చదువుతోంది. చరితకు మొదటి నుంచి క్రీడలపై ఆసక్తి. తాజాగా కీసరలో నిర్వహించిన అండర్ –14 సైక్లింగ్ పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించింది. ఈ నెల 17న జార్ఖండ్ లో జరగనున్న నేషనల్​ లెవల్ ​పోటీల్లో పాల్గొనున్నది.