కన్నుల పండువగా రథోత్సవం

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గోపాలకృష్ణ మఠంలో చేపట్టిన రథోత్సవం వైభవంగా సాగింది. మఠం నుంచి ప్రారంభమైన రథోత్సవంలో మహిళలు పెద్ద సంఖ్యలో మంగళ హారతులతో పాల్గొనగా.. భక్తులు కీర్తనలు భజనలు చేస్తూ ముందుకు నడిచారు. అంతకుముందు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరైన ప్రత్యేక పూజలు చేశారు. మఠాధిపతి యోగానంద సరస్వతితో కలిసి భజనలు కీర్తనల్లో పాల్గొన్నారు. గోపాలకృష్ణ మఠం వ్యవస్థాపకుడు పూర్ణానంద సరస్వతి పుణ్యతిథి సందర్భంగా ప్రతి ఏటా రథోత్సవం, ఐదు రోజులపాటు జాతర నిర్వహిస్తామని పీఠాధిపతి యోగానంద సరస్వతి  తెలిపారు.    - వెలుగు ఫొటోగ్రాఫర్, అదిలాబాద్