చార్‌ధామ్ యాత్రను వాయిదా వేస్తున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. తదుపరి ఆదేశాలు జారీచేసిన తర్వాత యాత్ర వాయిదా కొనసాగుతుందని తెలిపింది. ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాలతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. యాత్ర వాయిదా క్రమంలో కరోనా సంబంధిత మార్గదర్శకాల్లో ప్రభుత్వం మరోసారి మార్పులు చేసింది.
అంతకుముందు ఉత్తరాఖండ్‌లోని మూడు జిల్లాల ప్రజల కోసం చార్‌ధామ్ యాత్రను పాక్షికంగా ప్రారంభించనున్నట్లు ఆ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. జూలై 1 నుంచి యాత్ర మొదటి దశను, జూలై 11 నుంచి యాత్ర రెండో దశను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
