పంజాబ్ ఎన్నికలపై మాట్లాడిన సీఎం సతీమణి

పంజాబ్ ఎన్నికలపై మాట్లాడిన సీఎం సతీమణి

దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సమరం నెలకొంది. రేపు పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ సతీమణి కమల్ జిల్ కౌర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల విషయంలో తాము సానుకూలంగా ఉన్నామన్నారు. చన్నీజీకి పంజాబ్ ప్రజల ప్రేమ మద్దతు ఉందన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆయనను ముఖ్యమంత్రిగా నియమించడానికి కారణం కూడా అదే అన్నారు కమల్‌జిత్ కౌర్. 

మరోవైపు రేపు పంజాబ్‌లో 23 జిల్లాల్లోని 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 
117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 1304 మంది అభ్యర్థులు ఈసారి ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో 93 మంది మహిళలు ఉన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 77 స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, ఆప్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి.

ఇవి కూడా చదవండి: 

పంజాబ్లో పోలింగ్కు సర్వం

జాతరలో రాజకీయాలు సరికాదు