మహాశివరాత్రి నుంచి ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం...ఎందుకంటే....

గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి  సంచారం చేస్తుంటాయి.  ఆ సమయంలో  కొన్ని రాశుల వారి జీవితాల్లో  సానుకూల పరిణామాలు, మరికొన్ని రాశులవారి జీవితాల్లో ప్రతికూల పరిణామాలు ఎదురవుతుంటాయి. మార్చి  ఏడోతేదీ నుంచి బుధ గ్రహం ....  కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తుంది.  అదేరోజు సంపదను, ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు కుంభరాశిలోకి వస్తాడు. బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించిన తర్వాత రాహువు.... బుధుల కలయిక ఏర్పడబోతోంది. అదే సమయానికి శుక్రుడు అడుగుపెట్టగానే శని, శుక్రుడి కలయిక ఏర్పడుతుంది. వీటివల్ల ఏయే రాశులవారికి కలిసివస్తుందో తెలుసుకుందాం.

మిథునరాశి: రావల్సిన ధనం చేతికి అందుతుంది. దీనివల్ల అప్పుల బారినుంచి బయటపడతారు. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు లేదంటే ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లడానికి ఇది మంచి సమయం. పెట్టుబడి పెట్టడంవల్ల కలిసివచ్చే సమయం కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్లవచ్చు.

సింహ రాశి:  వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. కొంతకాలం నుంచి వేధిస్తోన్న సమస్యలు తొలగిపోవడంతోపాటు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. ఒత్తిడి దూరమవుతుంది. ప్రకృతితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. ఆరోగ్యం విషయంలో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంది.

కన్యా రాశి: ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి మంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారానికి సంబంధించిన పరిస్థితులు బాగుంటాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. మనసును నియంత్రణలో ఉంచుకుంటేనే ప్రశాంతంగా ఉండగలుగుతారు.